తప్పుచేసి ఎవరూ తప్పించుకోలేరు

సభను తప్పుదారి పట్టించాలని చూసిన సభ్యులు ఎవరైనా సరే నిబంధనల నుంచి తేలిగ్గా తప్పించుకోలేరని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు బుధవారం స్పష్టం చేశారు.

Published : 04 Jul 2024 03:49 IST

లోక్‌సభలో రాహుల్‌పై ఫిర్యాదును ఉద్దేశించి కేంద్ర మంత్రి రిజిజు వ్యాఖ్య

దిల్లీ: సభను తప్పుదారి పట్టించాలని చూసిన సభ్యులు ఎవరైనా సరే నిబంధనల నుంచి తేలిగ్గా తప్పించుకోలేరని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు బుధవారం స్పష్టం చేశారు. లోక్‌సభలో రాహుల్‌ గాంధీ అసత్యాలు చెప్పారని ఆరోపిస్తూ స్పీకర్‌ ఓం బిర్లాకు భాజపా సభ్యురాలు బాంసురీ స్వరాజ్‌ నోటీసు ఇచ్చిన మరుసటి రోజు కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్‌ గాంధీ పలు అంశాలను ప్రస్తావిస్తూ భాజపాపై విమర్శలు సంధించారు. రాహుల్‌ పలు అసత్యాలు మాట్లాడారని, దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా సభాపతికి విజ్ఞప్తి చేశామని కిరణ్‌ రిజిజు విలేకరులకు తెలిపారు. ప్రతి ఒక్క ఎంపీకి నిబంధనలు సమానంగా వర్తిస్తాయని, స్పీకర్‌ తీసుకునే చర్య కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని