కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన ఎంపీ ఈటల

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను బుధవారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated : 04 Jul 2024 04:28 IST

కంటోన్మెంట్, న్యూస్‌టుడే: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను బుధవారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని సివిలియన్‌ ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే విషయమై వివిధ అంశాల్లో తలెత్తుతున్న సందేహాలను నివృత్తి చేయాలని మంత్రిని కోరినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కంటోన్మెంట్‌ ప్రాంతంలోని 16 సివిల్‌ బజార్లను మాత్రమేనా.. లేక మిగతా వాటిని కూడా విలీనం చేస్తారా.? అనే అంశంపై స్పష్టతివ్వాలని కోరినట్లు తెలిపారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ బరితెగించి వ్యవహరిస్తోందని ఈటల ధ్వజమెత్తారు. చట్టసభల పదవుల్లో ఉన్నవారు ఫిరాయింపుల నిరోధకచట్టాన్ని బుట్టదాఖలు చేస్తూ బహిరంగంగా కండువాలు కప్పుకొనే విధానం మంచిది కాదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని