కర్ణాటక ఉపముఖ్యమంత్రితో వైఎస్‌ షర్మిల చర్చలు

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బుధవారం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో బెంగళూరులో సమావేశమయ్యారు. నగరంలోని సదాశివనగరలో డీకే శివకుమార్‌ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వర్తమాన రాజకీయాలపై చర్చించారు.

Published : 04 Jul 2024 05:31 IST

డీకే శివకుమార్‌తో వైఎస్‌ షర్మిల

ఈనాడు, బెంగళూరు: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బుధవారం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో బెంగళూరులో సమావేశమయ్యారు. నగరంలోని సదాశివనగరలో డీకే శివకుమార్‌ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వర్తమాన రాజకీయాలపై చర్చించారు. ఇదే సందర్భంగా ఈనెల 8న విజయవాడలో నిర్వహించే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి ఉత్సవాలకు డీకే శివకుమార్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. రాజశేఖరరెడ్డితో అనుబంధం ఉన్న ప్రముఖులను ఆహ్వానిస్తున్న షర్మిల ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ తదితరులకూ ఆహ్వానం పలికారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనూ ఆహ్వానించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని