రేపు హైదరాబాద్‌కు చంద్రబాబునాయుడు

తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ఆయన చేరుకుంటారు.

Published : 04 Jul 2024 05:41 IST

ఘనస్వాగతం పలకనున్న తెలంగాణ తెదేపా

ఈనాడు, హైదరాబాద్‌: తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ఆయన చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి హైదరాబాద్‌కు వస్తుండటంతో ఘనస్వాగతం పలకాలని తెదేపా తెలంగాణ శాఖ నిర్ణయించింది. స్వాగత కార్యక్రమానికి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బుధవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ చంద్రబాబుకు స్వాగత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తల్ని కోరారు. చంద్రబాబుకు స్వాగత కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఓ ప్రకటనలో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని