పుదుచ్చేరి ప్రభుత్వంలో ముసలం

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని ఏఐఎన్‌ఆర్‌సీ-భాజపా సంకీర్ణ సర్కార్‌లో రాజకీయ సంక్షోభానికి తాజాగా బీజం పడింది. అవినీతి సహా పలు అంశాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొందరు భాజపా సహా ఇతర ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.

Published : 05 Jul 2024 04:05 IST

దిల్లీ చేరిన అసంతృప్త ఎమ్మెల్యేలు

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని ఏఐఎన్‌ఆర్‌సీ-భాజపా సంకీర్ణ సర్కార్‌లో రాజకీయ సంక్షోభానికి తాజాగా బీజం పడింది. అవినీతి సహా పలు అంశాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొందరు భాజపా సహా ఇతర ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. పరిస్థితులు మరింత దిగజారకుండా తగిన చర్యలు తీసుకోవాలని, క్యాబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఘోరపరాజయానికి మూడేళ్లుగా కొనసాగుతున్న ఎన్‌.రంగసామి నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరు లోపమే కారణమని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో భాజపాకు చెందిన, నామినేటెడ్, స్వతంత్రులతో కూడిన ఏడుగురు సభ్యుల ఎమ్మెల్యేల బృందం భాజపా అధిష్ఠానం జోక్యాన్ని కోరింది. ఈ మేరకు గురువారం కమలదళం వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని