భాజపాతో ఘర్షణ లేదు: జేడీయూ

బిహార్‌కు ప్రత్యేక హోదా మంజూరు కోసం ఒత్తిడి చేసినంతమాత్రాన కేంద్రంలో భాజపా సారథ్యంలోని ఎన్డీయే సర్కారుతో ఎలాంటి ఘర్షణ తలెత్తదని జనతాదళ్‌ (యునైటెడ్‌) కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌ ఝా స్పష్టం చేశారు.

Published : 05 Jul 2024 04:06 IST

పట్నా: బిహార్‌కు ప్రత్యేక హోదా మంజూరు కోసం ఒత్తిడి చేసినంతమాత్రాన కేంద్రంలో భాజపా సారథ్యంలోని ఎన్డీయే సర్కారుతో ఎలాంటి ఘర్షణ తలెత్తదని జనతాదళ్‌ (యునైటెడ్‌) కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌ ఝా స్పష్టం చేశారు. ఈ మేరకు వస్తున్న వార్తల్ని ఆయన తోసిపుచ్చారు. వచ్చే ఏడాది జరగబోయే బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ నేతృత్వంలో జేడీ(యూ) మెరుగ్గా రాణిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ‘‘ప్రత్యేక హోదాపై గతవారం పార్టీ చేసిన తీర్మానం తర్వాత కేంద్రంతో ఘర్షణ వస్తుందని చాలామంది ఆశపడ్డారు. వారందరికీ నిరాశే మిగిలింది. ప్రత్యేక హోదా ద్వారా గానీ, ప్రత్యేక ప్యాకేజీతో గానీ మేం సాయం కోరుతున్నామనేది తీర్మానం స్పష్టంచేసింది. మేం ప్రస్తావించిన అంశాలపై ప్రధాని సానుభూతితోనే ఉన్నారు. కేంద్రం నుంచి పుష్కలంగా అందే నిధులతో మరో ఐదేళ్లలో బిహార్‌ కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలుస్తుంది’’ అని ఝా చెప్పారు. ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ సత్తా ఏమిటనేది ఇటీవలి ఎన్నికల్లో మరోసారి రుజువయిందన్నారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ పోటీచేసేందుకు తమ పార్టీ సంసిద్ధమవుతోందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని