అగ్నిపథ్‌పై శ్వేతపత్రం విడుదల చేయండి

అగ్నిపథ్‌పై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండు చేసింది. అగ్ని వీరులపట్ల వివక్ష ఉందని అభిప్రాయపడింది. క్షేత్ర స్థాయి పరిస్థితులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందని స్పష్టం చేసింది.

Published : 05 Jul 2024 04:07 IST

కేంద్రానికి కాంగ్రెస్‌ డిమాండ్‌

దిల్లీ: అగ్నిపథ్‌పై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండు చేసింది. అగ్ని వీరులపట్ల వివక్ష ఉందని అభిప్రాయపడింది. క్షేత్ర స్థాయి పరిస్థితులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందని స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ మాజీ సైనికుల విభాగం అధ్యక్షుడు కర్నల్‌ (రిటైర్డ్‌) రోహిత్‌ చౌధరి గురువారం దిల్లీలో మీడియాతో మాట్లాడారు. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన అమరుడైన అగ్నివీర్‌ అజయ్‌సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.48లక్షలే అందాయని, రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఇచ్చిందని, ప్రైవేటు బ్యాంకు నుంచి రూ.50లక్షల ఇన్సూరెన్సు సొమ్ము వచ్చిందని ఆయన వివరించారు. అజయ్‌ సింగ్‌కు పరిహారంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంటులో చేసిన ప్రకటన అబద్ధమని రాహుల్‌ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో ఈ వివరాలను వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే అజయ్‌ సింగ్‌ కుటుంబానికి రూ.98.39 లక్షలు అందాయని, మొత్తం రూ.1.65 కోట్లు అందనున్నాయని వివరణ ఇచ్చింది. 

  • సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగవద్దని, రాజ్‌నాథ్‌ సింగ్‌పై ఆరోపణలు చేసిన రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని భాజపా నేత, మాజీ వాయు సేనాధిపతి ఆర్‌కేఎస్‌ భదౌరీ డిమాండు చేశారు. అనేక చర్చల తర్వాతే అగ్నిపథ్‌ను అమల్లోకి తెచ్చామని స్పష్టం చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని