విభజన సమస్యలు పరిష్కరించుకోవాలి

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

Published : 05 Jul 2024 04:17 IST

మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చంద్రబాబు కీలకమైన వ్యక్తి. రాష్ట్రానికి చెందిన 7 మండలాలను ఏపీలో కలిపారు. వాటిని తిరిగి తెలంగాణలో కలిపే దిశగా చర్చించాలి. భద్రాచలంలో పార్కింగ్‌కు, డంపింగ్‌ యార్డుకు స్థలం లేదు. కృష్ణా, గోదావరి నదీ జలాల వాటా పంపకాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. రెండు రాష్ట్రాలకు.. ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన వాటా గురించి కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ ఎంతో ఆస్తిని సమకూర్చుకుంది. అందులో తెలంగాణ వాటా అడగలేదు’’ అని శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

రైతులను ఆదుకోవాలి: ఎమ్మెల్సీ మధు

తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ తాత మధు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి.. దిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. రైతుల సమస్యలు, ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని