ముగ్గురాయి గనుల్లో అక్రమాలు.. ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల నష్టం

మంగంపేట ముగ్గురాయి గనుల్లో 2019 నుంచి 2024 వరకు జరిగిన అవకతవకల వల్ల ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఆరోపించారు.

Published : 05 Jul 2024 04:57 IST

తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి 

ఈనాడు డిజిటల్, అమరావతి: మంగంపేట ముగ్గురాయి గనుల్లో 2019 నుంచి 2024 వరకు జరిగిన అవకతవకల వల్ల ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఆరోపించారు. వైకాపా ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌కు గురువారం ఆయన లేఖ రాశారు. గనులశాఖ మాజీ ఎండీ వెంకట్‌రెడ్డి, చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ సుదర్శన్‌రెడ్డి సహా ఇతర అధికార వర్గాలు, ఖనిజాన్ని ఎగుమతి చేసే కంపెనీలు కలిసి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాయని మండిపడ్డారు. ‘‘పరిమితికి మంచి కంపెనీలు మంగంపేటలో ముగ్గురాయిని తవ్వాయి. దీని వల్ల కార్పొరేషన్‌కు గణనీయమైన నష్టం వాటిల్లింది. ఏ గ్రేడ్‌ ఖనిజాన్ని సీ గ్రేడ్‌గా చూపించారు. వైకాపా నేతల ఇళ్లలో పనిచేసే వారికి ఏపీఎండీసీ నుంచి జీతాలు చెల్లించారు’’ అని లేఖలో రాంగోపాల్‌రెడ్డి ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు