అమర్‌నాథ్‌ యాత్ర అనంతరం.. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు!

అమర్‌నాథ్‌ యాత్ర ముగిసిన అనంతరం జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Published : 06 Jul 2024 03:42 IST

దిల్లీ: అమర్‌నాథ్‌ యాత్ర ముగిసిన అనంతరం జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు సిద్ధం కావాలని ఆ రాష్ట్ర భాజపా నేతలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదేశించినట్లుగా తెలిసింది. అమర్‌నాథ్‌ యాత్ర ఆగస్టు 19న ముగియనుంది. జమ్మూకశ్మీర్‌ ఎన్నికల్లో భాజపా 90 స్థానాల్లో పోటీ చేయనుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని