ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరుగుతోంది

తమ నియోజకవర్గాల్లో అధికారులు ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని భారాస ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 06 Jul 2024 03:44 IST

భారాస ఎమ్మెల్యేల ఆగ్రహం

మాట్లాడుతున్న భారాస ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డా.కల్వకుంట్ల సంజయ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: తమ నియోజకవర్గాల్లో అధికారులు ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని భారాస ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి అసెంబ్లీ స్పీకర్‌ను కలుద్దామని వస్తే ఆయన అందుబాటులో లేరని తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో వారు శుక్రవారం మాట్లాడారు. ‘‘సభాపతి మాకు ఉదయం 11 గంటలకు సమయమిచ్చారు. కానీ ఇప్పుడు ఒంటి గంట అవుతోంది. ఎందుకనో అందుబాటులోకి రాలేదు. మా నియోజకవర్గాల్లో ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఆ అధికారులపై ప్రివిలేజ్‌ మోషన్‌ ఇవ్వడానికి వచ్చాం. కాంగ్రెస్‌ నేతల పెత్తనం నడుస్తోంది. మళ్లీ స్పీకర్‌ ఎప్పుడు సమయమిస్తే అప్పుడొచ్చి కలుస్తాం. ప్రజల తరఫున పోరాడుతుంటే మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు’’ అని వారు పేర్కొన్నారు.

నిరుద్యోగుల అరెస్టు అమానుషమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో ఖండించారు. అరెస్టు చేసిన నిరుద్యోగులందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని