గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దు

గద్వాల భారాస ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్‌ చేస్తూ ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌ శ్రేణులు శుక్రవారం గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు.

Published : 06 Jul 2024 03:45 IST

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళన

ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకోవద్దని కోరుతూ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు వినతిపత్రం ఇస్తున్న ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు

హైదరాబాద్, న్యూస్‌టుడే: గద్వాల భారాస ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్‌ చేస్తూ ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌ శ్రేణులు శుక్రవారం గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు. కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన పార్టీలోకి వస్తే కాంగ్రెస్‌కు చెడ్డపేరు వస్తుందన్నారు. బీసీ మహిళ, ఉన్నత విద్యావంతురాలిగా పేరున్న సరిత రాజకీయాల్లో రానిస్తున్నారని, ఆమెను ప్రోత్సహించాలని రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గం కాంగ్రెస్‌ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాసిన లేఖను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అందజేశారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని