నెల రోజుల్లో మోదీ ప్రభుత్వ పతనం

కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, నెల రోజుల్లోపే అది కుప్పకూలడం ఖాయమని ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు.

Published : 06 Jul 2024 03:46 IST

ఆర్జేడీ సభలో లాలూ వ్యాఖ్య

పట్నా: కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, నెల రోజుల్లోపే అది కుప్పకూలడం ఖాయమని ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు. పట్నాలో శుక్రవారం నిర్వహించిన ఆర్జేడీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. మోదీ సర్కారు ఏ క్షణమైనా పతనం కావచ్చు...బహుశా ఆగస్టు లోపలే అది జరగవచ్చని లాలూ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్జేడీ శ్రేణులకు సూచించారు. ఆ సమయంలో వేదికపై లాలూ చెంతనే ఆయన  కుమారుడు తేజస్వీ యాదవ్‌ ఉన్నారు. లాలూ వ్యాఖ్యలను భాజపా నేతలు తోసిపుచ్చారు. ఆర్జేడీ అధినేత భ్రమల్లో జీవిస్తున్నట్లుందని కేంద్ర మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని