8న రాజమహేంద్రవరంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం

రాజమహేంద్రవరంలో ఈ నెల 8న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వెల్లడించారు.

Published : 06 Jul 2024 05:33 IST

రాజమహేంద్రవరం (దేవీచౌక్‌), న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలో ఈ నెల 8న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వెల్లడించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు ఎల్‌.మురుగన్, శ్రీనివాసవర్మ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ అరుణ్‌సింగ్‌ హాజరవుతారన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వ తప్పిదాలతో ఆర్థిక లోటుపాట్లు, విభజన హామీల అమలు తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. 2,250 మందిని ఆహ్వానించామని చెప్పారు. బాధ్యతాయుతమైన మిత్రపక్షంగా రాష్ట్రాభివృద్ధికి పూర్తిస్థాయిలో చేయూత అందించేందుకు కృషి చేస్తామన్నారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రేషన్‌ బియ్యం దందాను బట్టబయలు చేసిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను అభినందించారు. రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడైన మాజీ ఎమ్మెల్యే తండ్రిని ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించడంతోనే అక్రమాలకు తెరలేచిందని ఆరోపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని