పిన్నెల్లి వాసుల సమస్యపై కోర్టుకు వెళ్దాం

గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో ఎన్నికలప్పటి నుంచి పరిస్థితి కుదుటపడలేదని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌కు తెలిపారు.

Published : 06 Jul 2024 05:33 IST

గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి జగన్‌ సూచన

ఈనాడు, అమరావతి: గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో ఎన్నికలప్పటి నుంచి పరిస్థితి కుదుటపడలేదని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌కు తెలిపారు. ఈ గ్రామానికి చెందిన కొందరిని వెంటబెట్టుకుని వచ్చి శుక్రవారం ఆయన జగన్‌ను తాడేపల్లిలో కలిశారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితిపై వివరించారు. సుమారు 700 కుటుంబాలకు చెందిన 1,500 మంది గ్రామానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ‘ఈ సమస్యపై డీజీపీకి ఫిర్యాదు చేయాలి.. అవసరమైతే హైకోర్టునూ ఆశ్రయిద్దాం’ అని జగన్‌ వారికి చెప్పినట్లు తెలిసింది. ‘మీరు ఒకసారి గ్రామానికి రావాలి’ అని మహేష్‌రెడ్డి, గ్రామ ప్రతినిధులు అడగ్గా.. వస్తానని జగన్‌ చెప్పారు.

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి జగన్‌తో సమావేశమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైకాపా స్థానిక నేతలనూ వెంటబెట్టుకుని వచ్చిన ఆయన.. వారిని జగన్‌కు పరిచయం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని