చిత్తూరులో వైకాపాకు భారీ షాక్‌

వైకాపాకు చిత్తూరులో భారీ షాక్‌ తగిలింది. నగర మేయర్‌ ఎస్‌.అముద ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేసి తెదేపాలో చేరారు.

Published : 06 Jul 2024 05:41 IST

మేయర్, 20 మంది కార్పొరేటర్లు తెదేపాలో చేరిక 

తెదేపాలో చేరిన వైకాపా మేయర్, కార్పొరేటర్లతో చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్, మాజీ మేయర్‌ హేమలత 

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: వైకాపాకు చిత్తూరులో భారీ షాక్‌ తగిలింది. నగర మేయర్‌ ఎస్‌.అముద ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేసి తెదేపాలో చేరారు. ఆమెతో పాటు ఉప మేయర్‌ రాజేష్‌ కుమార్‌రెడ్డి, 20 మంది కార్పొరేటర్లు, ఇద్దరు కో-ఆప్షన్‌ సభ్యులు తెదేపా కండువా కప్పుకొన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థలో 2020లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 50 డివిజన్లకు 47 చోట్ల వైకాపా, 3 డివిజన్లలో తెదేపా అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలుపొందారు. మేయర్‌ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వు చేయగా.. వైకాపాకు చెందిన అముద (39వ డివిజన్‌) ఎన్నికయ్యారు. వైకాపాలో ఉంటే డివిజన్ల అభివృద్ధి అసాధ్యమని, తమను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలని భావించి వీరంతా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. తెదేపాలో చేరిన మేయర్‌ అముద, ఉప మేయర్‌ రాజేష్‌ కుమార్‌రెడ్డి, 20 మంది కార్పొరేటర్లు, ఇద్దరు కో- ఆప్షన్‌ సభ్యుల్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు వైకాపా జిల్లా అధ్యక్షుడు కేఆర్‌జే భరత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని