ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్‌ ఏకగ్రీవం

ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Published : 06 Jul 2024 05:36 IST

ఈనాడు, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప ఎన్నికల్లో ఈ రెండు స్థానాలకు వీరిద్దరు మాత్రమే నామినేషన్లు వేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ల ఉప సంహరణకు శుక్రవారంతో గడువు ముగిసింది. దీంతో నిబంధనల మేరకు వీరిద్దరి ఎన్నికను రిటర్నింగ్‌ అధికారి అధికారికంగా ధ్రువీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు