భవిష్యత్తులో అమరావతిపై అనిశ్చితి ఏర్పడకుండా చూడాలి: సీపీఎం

రాజధాని అమరావతిపై భవిష్యత్తులో అనిశ్చితి, గందరగోళం ఏర్పడకుండా వ్యవస్థీకృతమైన సమగ్ర ఏర్పాట్లు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు.

Published : 06 Jul 2024 05:37 IST

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిపై భవిష్యత్తులో అనిశ్చితి, గందరగోళం ఏర్పడకుండా వ్యవస్థీకృతమైన సమగ్ర ఏర్పాట్లు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. ‘‘రాజధాని రైతులు, కూలీల కడగండ్లకు కారణమైన గత ప్రభుత్వ తప్పుడు విధానాలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అమరావతిని అభివృద్ధి చేయాలి. రాజధాని నిర్మాణ జాప్యం జరిగినందున రైతులకు కౌలు, పేదలకు పెన్షన్‌ మరో 10 ఏళ్లు పొడిగించాలి. ఎసైన్డ్‌ రైతులకు సమాన ప్యాకేజీ ఇవ్వాలి. అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అమరావతి అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. రాజధాని నిర్మాణానికి విభజన చట్టం ప్రకారం నిధులను కేంద్రమే భరించాలి’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని