చంద్రబాబు నాయకుడు.. జగన్‌ ప్రతినాయకుడు

రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు దిల్లీ వెళితే.. హింసా రాజకీయాల్ని ప్రోత్సహించే వైకాపా అధ్యక్షుడు జగన్‌ మాత్రం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకు వెళ్లారని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Published : 06 Jul 2024 06:05 IST

ఎక్స్‌లో మంత్రి నారా లోకేశ్‌ 

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు దిల్లీ వెళితే.. హింసా రాజకీయాల్ని ప్రోత్సహించే వైకాపా అధ్యక్షుడు జగన్‌ మాత్రం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకు వెళ్లారని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘నాయకుడి తొలి దిల్లీ పర్యటన.. ప్రతినాయకుడి తొలి జిల్లా పర్యటన’ అంటూ చంద్రబాబు, జగన్‌ ప్రాధాన్యతల్ని ప్రస్తావిస్తూ ఎక్స్‌లో శుక్రవారం పోస్టు చేశారు. ‘అధికారులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులతో కలిసి కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. ప్రధానిని కలిసి రాష్ట్ర అవసరాలను విన్నవించారు. కానీ.. జగన్‌ మాత్రం అక్రమాలు, అరాచకాల్లో ఆరితేరి, పల్నాడును రావణకాష్ఠం చేసి.. చివరకు పాపం పండి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేను పరామర్శించారు’ అని ఎద్దేవా చేశారు. ‘ఏపీ సీఎం మలిపర్యటన తెలంగాణ సీఎంతో భేటీ అవ్వడం. విభజన చట్టంలో ఉన్న పెండింగ్‌ సమస్యల పరిష్కారం దిశగా సాగుతుంటే.. 1+6+4 సీట్లు వచ్చిన పార్టీ అధ్యక్షుడి మలి పర్యటన బాలికను లైంగికంగా వేధించి, పోక్సో చట్టం కింద అరెస్టై కర్నూలు జైలులో ఉన్న ఆయన పార్టీ మాజీ ఎమ్మెల్యే పరామర్శకా’ అంటూ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని