జయాపజయాలు ప్రజాస్వామ్యంలో భాగం

బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఓటమిపై ఆ పార్టీ నాయకుడైన రిషి సునాక్‌కు భారత లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్‌గాంధీ సానుభూతి తెలిపారు.

Published : 07 Jul 2024 03:48 IST

రిషి సునాక్‌కు రాహుల్‌ లేఖ

దిల్లీ: బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఓటమిపై ఆ పార్టీ నాయకుడైన రిషి సునాక్‌కు భారత లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్‌గాంధీ సానుభూతి తెలిపారు. జయాపజయాలు ప్రజాస్వామ్యంలో అనివార్య భాగమని, రెండింటినీ మనం సమానంగా తీసుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు శనివారం సునాక్‌కు లేఖ రాసిన రాహుల్‌గాంధీ.. బ్రిటన్‌ ప్రధానమంత్రిగా ఆయన అందించిన సేవలను, చూపిన అంకితభావాన్ని కొనియాడారు. తన పదవీకాలంలో భారత్, బ్రిటన్‌ల మధ్య స్నేహసంబంధాల బలోపేతానికి సునాక్‌ చేసిన కృషిని అభినందించారు. ‘‘మీ అనుభవంతో ప్రజాసేవను కొనసాగిస్తారని విశ్వసిస్తున్నా. మీ భావిజీవితం ఫలప్రదంగా కొనసాగాలి’’ అని రాహుల్‌గాంధీ అభిలషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు