ఎట్టకేలకు 400 సీట్లు.. భారత్‌లో కాదు.. బ్రిటన్‌లో

భాజపాను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు 370 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని,

Published : 07 Jul 2024 03:50 IST

భాజపాపై శశిథరూర్‌ వ్యంగ్యాస్త్రాలు

దిల్లీ: భాజపాను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు 370 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్డీయే) 400కు పైగా సీట్లు సాధిస్తుందని ప్రధాని మోదీ తన ప్రచారాల్లో తరచుగా చెప్పేవారు. కానీ ఫలితాల్లో 293 సీట్లతో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గురువారం బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికల్లో లేబర్‌ పార్టీ 400కు పైగా సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఈ రెండు దేశాల్లోని ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి శశి థరూర్‌ సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ వైరలైంది. ఇందులో ఆయన ‘‘ఎట్టకేలకు ‘అబ్‌ కీ బార్‌ 400 పార్‌ (ఈ సారి 400కు పైగా)’ సాధ్యమైంది. కానీ. వేరే దేశంలో’’ అంటూ భాజపాపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని