నేడు ఎన్టీఆర్‌ భవన్‌కు చంద్రబాబు

తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌కు ఆదివారం రానున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 65లోని ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీ చేపట్టి స్వాగతం పలకాలని తెలంగాణ తెదేపా నిర్ణయించింది.

Published : 07 Jul 2024 03:59 IST

ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీతో  స్వాగతం పలకాలని తెతెదేపా నేతల నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌కు ఆదివారం రానున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 65లోని ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీ చేపట్టి స్వాగతం పలకాలని తెలంగాణ తెదేపా నిర్ణయించింది. చంద్రబాబు నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఎన్టీఆర్‌ భవన్‌కు రానుండటంతో ఏర్పాట్లపై పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, అరవింద్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర వ్యవహారాల సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్‌రావు, నేతలు బంటు వెంకటేశ్వర్లు, నన్నూరి నర్సిరెడ్డి తదితరులు శనివారం సమావేశమై చర్చించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ర్యాలీ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. పార్టీ శ్రేణులందరూ తరలిరావాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని