30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదు

రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీమంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు.

Published : 07 Jul 2024 05:25 IST

మాజీమంత్రి పీతల సుజాత ధ్వజం

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీమంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. వీరందరి ఆచూకీ కనుక్కొని.. వారి కుటుంబాలకు అప్పగించడానికి ప్రస్తుత ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. 

‘‘ఆసరా పేరుతో మహిళల్ని జగన్‌ మోసం చేశారు. చేయూత పేరుతో చేతివాటం చూపారు. ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకునే విద్యార్థులుంటే అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పి... చివరకు ఒకరికే పరిమితం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు’’ అని సుజాత మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని