వైకాపా హయాంలో మంజూరైన పనులు కొనసాగిస్తాం..: మంత్రి గొట్టిపాటి

వైకాపా ప్రభుత్వంలో మంజూరైన పనులను తమ సర్కారు కొనసాగిస్తుందని, మార్చడం వంటి చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకమని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

Published : 07 Jul 2024 05:28 IST

అద్దంకి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వంలో మంజూరైన పనులను తమ సర్కారు కొనసాగిస్తుందని, మార్చడం వంటి చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకమని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ప్రజల ఆస్తికి నష్టం కలిగించే పనులు ఈ ప్రభుత్వం చేయదని, ఉపయోగపడే పనులన్నీ కొనసాగిస్తుందని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి పురపాలక సంఘంలో శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. అధికారులు ఎవరూ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దని సున్నితంగా మందలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని