రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడం సంతోషకరం

విభజన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశం కావడం సంతోషకరమని ఏపీ భాజపా అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు పేర్కొన్నారు.

Published : 07 Jul 2024 05:34 IST

భాజపా నాయకులు వల్లూరు జయప్రకాశ్, రమేష్‌నాయుడు

విలేకర్లతో మాట్లాడుతున్న భాజపా నాయకులు వల్లూరు జయప్రకాశ్, రమేష్‌నాయుడు  

ఈనాడు, దిల్లీ: విభజన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశం కావడం సంతోషకరమని ఏపీ భాజపా అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు పేర్కొన్నారు. శనివారం ఇక్కడి ఏపీభవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఆస్తులు పంపిణీ చేసుకొని, విద్యుత్తు, నీటి సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తే ఇరు రాష్ట్రాలకూ ఎంతో మేలు జరుగుతుందని జయప్రకాశ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందించేందుకు కేంద్ర మంత్రులు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రకార్యదర్శి రమేష్‌నాయుడు మాట్లాడుతూ.. ఇదివరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన జగన్, కేసీఆర్‌ విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని