వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు నేడు జగన్, షర్మిల

వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులు సోమవారం నివాళులర్పించనున్నారు. వైకాపా అధినేత జగన్‌ శనివారమే పులివెందులకు చేరుకోగా..

Published : 08 Jul 2024 03:12 IST

జయంతి సందర్భంగా నివాళులు

ఈనాడు-కడప, న్యూస్‌టుడే, పులివెందుల: వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులు సోమవారం నివాళులర్పించనున్నారు. వైకాపా అధినేత జగన్‌ శనివారమే పులివెందులకు చేరుకోగా.. తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఆదివారం రాత్రి ఇడుపులపాయకు చేరుకుని బస చేశారు. తొలుత జగన్‌ నివాళులర్పించి వెళ్లిన తర్వాత షర్మిల హాజరుకానున్నారు. 


మంగళగిరిలో కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి 

విజయవాడ (గవర్నర్‌పేట): ఏపీసీసీ ఆధ్వర్యంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని మంగళగిరిలో సోమవారం నిర్వహించనున్నట్లు సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి ఇప్పటికే అందరినీ ఆహ్వానించారని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి సుధాకరరెడ్డి తదితరులు హాజరుకానున్నారని వెల్లడించారు. మాణికం ఠాగూర్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని