భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నేడు

భాజపా రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం నిర్వహించనున్నారు.

Published : 08 Jul 2024 03:13 IST

ఈనాడు, రాజమహేంద్రవరం: భాజపా రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే సమావేశానికి కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీవిశ్వనాథరాజు, భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు సుమారు 2,500 మంది హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని