అణగారిన వర్గాల సమస్యలపై పోరాటం

ఎస్సీ వర్గీకరణతో పాటు అణగారిన వర్గాల సమస్యలపై ఎమ్మార్పీఎస్‌ 30 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.

Published : 08 Jul 2024 05:38 IST

మంద కృష్ణమాదిగ

జాతీయ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంద కృష్ణమాదిగ

బౌద్ధనగర్, న్యూస్‌టుడే: ఎస్సీ వర్గీకరణతో పాటు అణగారిన వర్గాల సమస్యలపై ఎమ్మార్పీఎస్‌ 30 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. హైదరాబాద్‌ పార్శీగుట్టలోని జాతీయ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్‌ మాదిగ అధ్యక్షతన సమితి 30వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంద కృష్ణమాదిగ సమితి జెండా ఎగరేసి జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణ అంశం ప్రస్తుతం అంతిమ దశలో ఉందని పేర్కొన్నారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, మాజీ ఎంపీ బి.వెంకటేశ్‌ నేత, కందుకూరు జగదీశ్వర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని