కేంద్రం ధోరణితోనే ఎస్సీ వర్గీకరణలో జాప్యం

ఎస్సీ వర్గీకరణ అంశంపై భాజపా ప్రభుత్వం ఇప్పటికీ నాన్చుతుండటంతో విద్య, ఉద్యోగావకాశాల్లో మాదిగలు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మార్పీఎస్‌ (టీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 08 Jul 2024 05:38 IST

ఎమ్మార్పీఎస్‌(టీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌

మాట్లాడుతున్న వంగపల్లి శ్రీనివాస్‌. చిత్రంలో ఎర్రోళ్ల శ్రీనివాస్, విమలక్క, ఏపూరి సోమన్న,  కోదండరాం తదితరులు

రాంనగర్, న్యూస్‌టుడే: ఎస్సీ వర్గీకరణ అంశంపై భాజపా ప్రభుత్వం ఇప్పటికీ నాన్చుతుండటంతో విద్య, ఉద్యోగావకాశాల్లో మాదిగలు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మార్పీఎస్‌ (టీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం చేస్తున్న జాప్యానికి నిరసనగా ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ఆయన దీక్ష చేపట్టారు. తెజస అధినేత ప్రొఫెసర్‌ కోదండరాం, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య, ప్రజా గాయని విమలక్క హాజరై సంఘీభావం తెలిపారు. ప్రొ.కోదండరాం మాట్లాడుతూ.. హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌కు బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలే చేపట్టేలా అధికారమివ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు, గాయకుడు ఏపూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని