ప్రజాస్వామ్య స్ఫూర్తికి రుజువు

లోక్‌సభ స్పీకర్‌ పదవికి పోటీ జరగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి రుజువని, అది వర్థిల్లడానికి సూచికని ఓం బిర్లా స్పష్టం చేశారు.

Published : 08 Jul 2024 03:57 IST

స్పీకర్‌ ఎన్నికల్లో పోటీపై ఓం బిర్లా వ్యాఖ్య

కోటా: లోక్‌సభ స్పీకర్‌ పదవికి పోటీ జరగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి రుజువని, అది వర్థిల్లడానికి సూచికని ఓం బిర్లా స్పష్టం చేశారు. పార్లమెంటులో అంతరాయాలను ఆయన తేలిగ్గా తీసుకున్నారు. పార్లమెంటులో భిన్నాభిప్రాయాలకు, వీధుల్లో చోటుచేసుకునేవాటికీ తేడా ఉంటుందని, ఆ రెండింటి మధ్య తేడా ఉండాలని ప్రజలు కోరుకుంటారని స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గమైన కోటాకు వచ్చిన ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘ప్రజాస్వామ్యంలో ఏకీభవించడం, వ్యతిరేకించడం సహజం. భిన్నాభిప్రాయాలుండొచ్చు. అలాంటివి ఉండటమే మంచిది. భిన్నాభిప్రాయాలను మదిస్తేనే ప్రభుత్వం నిర్మాణాత్మక మార్గంలో వెళ్లగలదు. ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తెలుసుకోగలుగుతుంది. ఎక్కువ అభిప్రాయాలు రావడం మంచిదే’ అని ఓం బిర్లా పేర్కొన్నారు.   

బలమైన ప్రతిపక్షం మంచిదే

సభలో బలమైన ప్రతిపక్షం ఉండటంవల్ల ప్రజల అభిప్రాయాలను వినిపించడానికి అవకాశం ఉంటుందని, అది సవాలు కాదని, అవకాశమని, తమ అభిప్రాయాలను నిర్మాణాత్మకంగా వినిపించే అవకాశం లభించిందని ప్రజలు భావిస్తారని ఓం బిర్లా తెలిపారు. 

వారిని ప్రజలు ఎన్నుకున్నారు

పంజాబ్‌లోని ఖడూర్‌ సాహిబ్‌ నుంచి వివాదాస్పద సిక్కు అతివాద బోధకుడు అమృత్‌పాల్‌ సింగ్, కశ్మీర్‌లోని బారాముల్లా నుంచి ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసును ఎదుర్కొంటున్న రషీద్‌లపై ఓం బిర్లా స్పందించారు. వారిని ప్రజలు ఎన్నుకున్నారని, లోక్‌సభ నిబంధనల ప్రకారం.. ప్రమాణం చేయించామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు