మంత్రివర్గంలో గొల్ల కురుమలకు సముచిత స్థానం కల్పించాలి

రాష్ట్రంలో 50 లక్షల పైగా జనాభా ఉన్న గొల్ల కురుమలకు మంత్రి వర్గంలో చోటు కల్పించడంతోపాటు ఎమ్మెల్సీ, సలహాదారు, ఐదు కార్పొరేషన్లు, పీసీసీ అధ్యక్ష పదవి లేదా కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య కోరారు.

Published : 09 Jul 2024 04:19 IST

సీఎంకు ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య వినతి 

హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 50 లక్షల పైగా జనాభా ఉన్న గొల్ల కురుమలకు మంత్రి వర్గంలో చోటు కల్పించడంతోపాటు ఎమ్మెల్సీ, సలహాదారు, ఐదు కార్పొరేషన్లు, పీసీసీ అధ్యక్ష పదవి లేదా కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య కోరారు. ఆయన సోమవారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్‌ పరిధి నుంచి తాను మంత్రి పదవి ఆశిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ గొల్ల కురుమలు లేని క్యాబినెట్‌ లేదన్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సహా భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరినా తనకు సమ్మతమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన 35 కార్పొరేషన్‌ ఛైర్మన్లలో గొల్ల కురుమలకు ప్రాతినిధ్యం లభించలేదని, భవిష్యత్తులో మిగతా వాటి భర్తీలో సముచిత స్థానం కల్పిస్తారనే నమ్మకం సీఎంపై ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని