ఇవిగో సమస్యలు.. పరిష్కరించండి

విద్యా వ్యవస్థను చక్కదిద్దాలని, సమస్యలను లేఖ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొస్తే.. అసలు సమస్యలే లేవని విద్యాశాఖ ప్రకటించడం సరికాదని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.

Published : 09 Jul 2024 04:28 IST

విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లిన హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యా వ్యవస్థను చక్కదిద్దాలని, సమస్యలను లేఖ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొస్తే.. అసలు సమస్యలే లేవని విద్యాశాఖ ప్రకటించడం సరికాదని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. వాస్తవాలను పక్కనపెట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. సోమవారం తాను సిద్దిపేట నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పరిశీలించానని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తెస్తున్నానని తెలిపారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘పాఠశాలల్లో వంటమనిషి-సహాయకులకు ఇచ్చే గౌరవ వేతనం రూ.3 వేలు గతేడాది డిసెంబరు వరకే చెల్లించారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల మధ్యాహ్న భోజన బిల్లులు జనవరి 2024 వరకు మాత్రమే వచ్చాయి. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థుల మధ్యాహ్న భోజనం బిల్లులు ఏప్రిల్‌ వరకే చెల్లించారు. కోడిగుడ్డు బిల్లులు జనవరి వరకు మాత్రమే ఇచ్చారు. సర్వశిక్షా అభియాన్, ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌ వేతనాలు మే వరకే వచ్చాయి. తక్షణమే ప్రతి పాఠశాలకు నెలకు రూ.10 వేలు విడుదల చేసి, పారిశుద్ధ్య నిర్వహణ చేయాలి.  సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలి’’ అని హరీశ్‌రావు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని