మోదీ మళ్లీ ప్రధాని కావడానికి సీబీఐ, ఈడీలే కారణం: జగ్గారెడ్డి

కేంద్రంలో భాజపా మూడోసారి అధికారంలోకి రావడానికి సీబీఐ, ఈడీ, ఐటీలే..కారణమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Published : 09 Jul 2024 04:23 IST

హైదరాబాద్, న్యూస్‌టుడే: కేంద్రంలో భాజపా మూడోసారి అధికారంలోకి రావడానికి సీబీఐ, ఈడీ, ఐటీలే..కారణమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి పేర్కొన్నారు. మోదీ వాటిని ఉపయోగించకపోతే రాహుల్‌గాంధీ ఈసారి ప్రధాని అయ్యేవారని అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే ఈడీ, సీబీఐ, ఐటీ కేసులున్న వారిని భాజపాలోకి తీసుకుంటున్నారని, కేజ్రీవాల్‌ లొంగకపోవడం వల్లే బెయిల్‌ రావడం లేదన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని