మైనారిటీలపై రేవంత్‌ సర్కారు నిర్లక్ష్యం

మైనారిటీల సంక్షేమాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి మహమూద్‌ అలీ విమర్శించారు.

Published : 09 Jul 2024 04:23 IST

భారాస నేత మహమూద్‌ అలీ విమర్శ 

ఈనాడు, హైదరాబాద్‌: మైనారిటీల సంక్షేమాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి మహమూద్‌ అలీ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన సోమవారం మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌ పాతబస్తీలో విద్యుత్‌ బిల్లుల వసూలును అదానీ సంస్థకు అప్పజెప్పాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మైనారిటీలను అవమానపరచడమే. కేసీఆర్‌ హయాంలో ఏటా రూ.2 వేల కోట్లను మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో కేటాయించారు. రానున్న బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లను మైనారిటీలకు కేటాయించి కాంగ్రెస్‌ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి’’ అని మహమూద్‌ అలీ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని