ఎమ్మెల్సీగా హరిప్రసాద్‌

శాసనసభ్యుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన పి.హరిప్రసాద్‌కు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి విజయరాజు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

Published : 09 Jul 2024 04:47 IST

ఈనాడు, అమరావతి: శాసనసభ్యుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన పి.హరిప్రసాద్‌కు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి విజయరాజు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు హరిప్రసాద్‌ రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం వెలగపూడిలోని అసెంబ్లీ భవనంలో ఉన్న రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన ప్రతినిధులు పాల్గొన్నారు. రెండో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికైన సి.రామచంద్రయ్య ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు