తితిదేను అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారు

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని(తితిదే) అక్రమాలకు అడ్డాగా మార్చుకుని రూ.కోట్లు దండుకున్న మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డిలపై విచారణ చేపట్టి,

Published : 09 Jul 2024 04:50 IST

ధర్మారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలపై చర్యలు తీసుకోవాలి
సీఎస్‌కు తెదేపా నేతల ఫిర్యాదు 

సీఎస్‌కు ఫిర్యాదు చేస్తున్న తెదేపా నేతలు 

ఈనాడు డిజిటల్, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానాన్ని(తితిదే) అక్రమాలకు అడ్డాగా మార్చుకుని రూ.కోట్లు దండుకున్న మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డిలపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌కు తెదేపా నేతలు గురజాల మాల్యాద్రి, నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. వైకాపాకు, మాజీ సీఎం జగన్‌కు లబ్ధి చేకూర్చేలా వారిద్దరూ ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఎస్‌కు వినతిపత్రం అందించారు. ‘ఐఏఎస్‌ అధికారి కాకున్నా ధర్మారెడ్డిని తొలుత జేఈవోగా తర్వాత ఈవోగా వైకాపా ప్రభుత్వం నియమించింది. తిరుమల అతిథి గృహాలకు కేటాయించే భూముల్లోనూ సుప్రీంకోర్టు నిబంధనల్ని ధర్మారెడ్డి పాటించలేదు. ఫర్నిచర్‌ మార్పు పేరుతో రూ.కోట్లు పక్కదారి పట్టించారు. తిదేకు ఎవరు విరాళాలు ఇచ్చినా అవి శ్రీవాణి ట్రస్ట్‌ ఖాతాలోకి వెళ్లేలా చేసి వాటిని మళ్లించారు’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు