మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తునిపై ఐజీకి ఫిర్యాదు

గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై స్థానిక ఐతానగర్‌కు చెందిన    గొట్టిముక్కల సుధాకర్‌ గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి సోమవారం ఫిర్యాదు చేశారు.

Published : 09 Jul 2024 04:52 IST

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై స్థానిక ఐతానగర్‌కు చెందిన    గొట్టిముక్కల సుధాకర్‌ గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి సోమవారం ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులపై దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. స్పందించిన    ఐజీ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా బాధితుడు సుధాకర్‌ విలేకర్లతో మాట్లాడారు. ‘పోలింగ్‌ రోజు ఓటు వేయడానికి వెళ్లిన సందర్భంలో వరుసలో రావాలని సూచించడంతో అప్పటి తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌ నన్ను కొట్టారు. ఒక్కసారిగా నేనూ తిరిగి చేయిచేసుకున్నాను. ఇంతలో శివకుమార్‌ అనుచరులు వచ్చి నాపై తీవ్రస్థాయిలో దాడి చేశారు. ఈ ఘటనపై తెనాలి రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. మొత్తం 14 మంది దాడి చేస్తే కేవలం ఏడుగురిపైనే చిన్న సెక్షన్లతో   కేసు నమోదు చేశారు. మిగిలిన ఏడుగురి పేర్లను చేర్చడంతోపాటు హత్యాయత్నం సెక్షన్‌ జోడించాలి’ అని ఐజీకి విన్నవించినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని