వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

Published : 09 Jul 2024 04:53 IST

అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించేందుకు నిరాకరణ

ఈనాడు, అమరావతి: మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది (జీపీ) కేఎం కృష్ణారెడ్డి కోరడంతో విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. మూడేళ్ల కిందట నమోదైన కేసును తెరపైకి తెచ్చి అరెస్టులు చేస్తున్నారన్నారు. పిటిషనర్‌కు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరారు. పోలీసుల తరఫున జీపీ కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. తెదేపా పార్టీ కార్యాలయంపై 2021లో వైకాపా నేతల కనుసన్నల్లో మూకుమ్మడి దాడి చేశారన్నారు. అప్పట్లో కేసు నమోదు చేసినా.. దర్యాప్తులో పురోగతి లేదన్నారు. ప్రస్తుతం దర్యాప్తు మొదలుపెట్టేసరికి బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారన్నారు. అరెస్టు నుంచి రక్షణ ఇవ్వొద్దని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని