యువతను నిరుద్యోగులుగా ఉంచడమే మోదీ లక్ష్యం

దేశంలోని యువతను నిరుద్యోగులుగా ఉంచడమే ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వ ఏకైక లక్ష్యమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు.

Published : 10 Jul 2024 03:44 IST

కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఆరోపణ

దిల్లీ: దేశంలోని యువతను నిరుద్యోగులుగా ఉంచడమే ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వ ఏకైక లక్ష్యమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లుగా కోట్లాది మంది యువత కలలపై మోదీ సర్కారు నీళ్లు చల్లిందని ఇది వాస్తవమని మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా దుయ్యబట్టారు. 2015-2023 మధ్య కాలంలో కార్పొరేటేతర రంగంలో 54లక్షల ఉద్యోగాలు పోయాయని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) కార్పొరేటేతర రంగం వార్షిక నివేదికలో తెలిపిందన్నారు. నిరుద్యోగంపై సిటిగ్రూప్‌ వంటి సంస్థలు ఇచ్చిన స్వతంత్ర ఆర్థిక నివేదికలను ఖండించిన మోదీ సర్కారు ఈ ప్రభుత్వ నివేదికనూ తిరస్కరిస్తుందా అంటూ ఖర్గే ప్రశ్నించారు. భారతీయ ఉద్యోగ నివేదిక 2024 ప్రకారం 2012-2019 మధ్య కాలంలో 7కోట్ల మంది యువత ఉద్యోగాల్లో చేరారని కానీ, వారి అభివృద్ధిలో ఇప్పటివరకూ ఎటువంటి మార్పు లేదన్నారు. దేశంలో 25ఏళ్లలోపు గ్యాడుయేట్లల్లో 42.3శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారన్న 2023 అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఇచ్చిన నివేదికనూ ఉటంకించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని