పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్లండి

లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో భాజపాను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పదాధికారులకు సూచించారు.

Published : 10 Jul 2024 03:44 IST

పదాధికారుల సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 
12న జరిగే విస్తృతస్థాయి సమావేశం ఎజెండాపై చర్చ

పదాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రశేఖర్‌ తివారి, పక్కన ఈటల రాజేందర్, ఏవీఎన్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో భాజపాను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పదాధికారులకు సూచించారు. ఈ నెల 12న జరిగే భాజపా విస్తృతస్థాయి సమావేశం ఎజెండాపై చర్చించేందుకు కిషన్‌రెడ్డి నేతృత్వంలో మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరిగింది. భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి చంద్రశేఖర్‌ తివారి, తమిళనాడు సహ ఇన్‌ఛార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి సహా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ఇతర పదాధికారులు పాల్గొన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయలేదనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే కార్యాచరణ రూపొందించనున్నారు. దీంతోపాటు పౌరసరఫరాల శాఖలో అవినీతి జరిగిందని ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న కీలక సమావేశంలో భాజపా నేత, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని