డీఎస్సీ అభ్యర్థులను దగా చేస్తారా?

డీఎస్సీ వాయిదా వేయాలని, పోస్టులు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 10 Jul 2024 03:45 IST

సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: డీఎస్సీ వాయిదా వేయాలని, పోస్టులు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి.. ఇప్పుడు వారిని దగా చేస్తారా? అని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ‘25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని  మాట ఇచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులను రెచ్చగొట్టి మీరు కొలువుదీరితే సరిపోతుందా? యువతకు కొలువులు అక్కర్లేదా? డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారు. న్యాయం జరిగే వరకు అభ్యర్థులకు గులాబీ జెండా అండగా ఉంటుంది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక నేతన్నలపై కక్ష కట్టి వారి ప్రాణాలు తీస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని