అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్‌ కారణం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్‌ కారణమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు.

Published : 10 Jul 2024 03:48 IST

ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌

హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్‌ కారణమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో శివసేనారెడ్డి, యువజన కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌ఛార్జి సురభి ద్వివేది, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీ నాయకుడు వేగి వెంకటేశ్, తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణం కూడా యువజన కాంగ్రెస్సే అన్నారు. శివసేనారెడ్డి మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్‌ నూతన కార్యవర్గ ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 5 నుంచి సెప్టెంబరు 5 వరకు సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు