ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరికలు

కాంగ్రెస్‌ ప్రజాపాలనకు ఆకర్షితులై రాజ్యాంగబద్ధంగా భారాస ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య తెలిపారు.

Updated : 10 Jul 2024 06:13 IST

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య
కేటీఆర్‌ వ్యాఖ్యలకు ఖండన

హైదరాబాద్, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రజాపాలనకు ఆకర్షితులై రాజ్యాంగబద్ధంగా భారాస ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య తెలిపారు. ఆయన మంగళవారం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా హాలులో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులకు మొదట శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ దిల్లీలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో దళితుడైన భట్టివిక్రమార్క ప్రతిపక్ష నేతగా ఉండటం చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి భారాసలో చేర్చుకుని ఫిరాయింపులను మొదలుపెట్టిందే కేసీఆర్‌ అని తెలిపారు. తెలంగాణలో భారాసకు మనుగడ లేదని, ఆ పార్టీని భాజపాలో విలీనం చేసేందుకు దిల్లీలో ప్రయత్నాలు జరుగుతున్నాయని అయిలయ్య పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు