11న మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ నెల 11న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.

Updated : 10 Jul 2024 06:13 IST

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ నెల 11న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. తొలుత ఉదయం 11.20 గంటలకు అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం దార్లపూడికి చేరుకుని పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. అనంతరం విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌కు చేరుకుని వర్చువల్‌గా సీఐఐ కాన్ఫరెన్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా రెండు భవనాలు ప్రారంభించనున్నారు. సాయంత్రం 4.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని ఆ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 6.10 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని