ఇనుము చోరీ కేసులో వైకాపా నాయకుడి అరెస్టు

హంద్రీనీవా కాలువ 14వ ప్యాకేజీ పనులు చేస్తున్న హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా సంస్థకు చెందిన 7 టన్నుల ఇనుపకడ్డీల చోరీ కేసులో వైకాపా నాయకుడు కుర్లి శివారెడ్డిని అరెస్టు చేసినట్లు తలుపుల ఎస్సై దిలీప్‌కుమార్‌ తెలిపారు.

Published : 10 Jul 2024 04:46 IST

తలుపుల, న్యూస్‌టుడే: హంద్రీనీవా కాలువ 14వ ప్యాకేజీ పనులు చేస్తున్న హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా సంస్థకు చెందిన 7 టన్నుల ఇనుపకడ్డీల చోరీ కేసులో వైకాపా నాయకుడు కుర్లి శివారెడ్డిని అరెస్టు చేసినట్లు తలుపుల ఎస్సై దిలీప్‌కుమార్‌ తెలిపారు. 2022 జనవరిలో శ్రీసత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గం, తలుపుల మండలం ఏపులపల్లి సమీపంలో ఓ వంతెన నిర్మాణంలో ఉండగా అధికారులు, సిబ్బందిని కుర్లి శివారెడ్డి భయపెట్టి, బెదిరించి 7 టన్నుల ఇనుమును ఎత్తుకెళ్లాడు. అప్పట్లోనే సంస్థ ప్రతినిధి శివరామకృష్ణ ఫిర్యాదు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో శివరామకృష్ణ మంగళవారం మరోసారి ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి శివారెడ్డిని అరెస్టు చేశారు. నిందితుడిని కదిరి కోర్టులో హాజరు పరచగా రిమాండుకు ఆదేశించారు. నిందితుడి నుంచి ఒకటిన్నర టన్నుల ఇనుప కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని