బాధ్యతలు స్వీకరించిన పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు

సంక్షేమశాఖల్లో పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Published : 11 Jul 2024 04:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: సంక్షేమశాఖల్లో పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ఎస్టీ సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్‌) ఛైర్మన్‌గా బెల్లయ్యనాయక్‌ తేజావత్, గిరిజన సహకార ఆర్థిక సంస్థ ఛైర్మన్‌గా కొట్నాక తిరుపతి.. మాసాబ్‌ ట్యాంక్‌లోని సంక్షేమభవన్‌లో బాధ్యతలు చేపట్టారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. 

  • వికలాంగుల ఆర్థిక సంస్థ ఛైర్మన్‌గా ముత్తినేని వీరయ్య మలక్‌పేటలోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, సంక్షేమశాఖల సలహాదారు షబ్బీర్‌అలీ, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. 
  • మహిళా ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్‌గా బండ్రు శోభారాణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. 
  • పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బండి గుర్నాథరెడ్డి.. డీజీపీ ఆఫీస్‌లోని కార్పొరేషన్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 
  • రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్‌గా ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శి జనక్‌ప్రసాద్‌.. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని కార్మిక శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌లు జనక్‌ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 
  • రాష్ట్ర ఆయిల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్‌ తదితరులు హాజరై అభినందనలు తెలిపారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని