జనగామ భారాస కార్యాలయానికి నోటీసులు

జనగామ జిల్లా భారాస కార్యాలయానికి బుధవారం జనగామ తహసీల్దార్‌ వెంకన్న నోటీసులు జారీ చేశారు.

Published : 11 Jul 2024 04:03 IST

జనగామ టౌన్, న్యూస్‌టుడే: జనగామ జిల్లా భారాస కార్యాలయానికి బుధవారం జనగామ తహసీల్దార్‌ వెంకన్న నోటీసులు జారీ చేశారు. మండలంలోని యశ్వంతాపూర్‌లో గత భారాస ప్రభుత్వం పార్టీ కార్యాలయానికి ఎకరం స్థలం కేటాయించగా భవనం నిర్మించారు. అయితే ఆ కార్యాలయ ఆవరణలో మరో 20 గుంటల భూమి ఎక్కువగా ఉన్నట్లుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా, అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌ ఆదేశాల ప్రకారం తనిఖీ చేయగా పార్టీ కార్యాలయ స్వాధీనంలో 20 గుంటల భూమి అదనంగా ఉన్నట్లు తేలిందని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి మృతి చెందడంతో స్థానిక భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో నోటీసులను అందజేసినట్లు రెవెన్యూ ఆర్‌ఐ అన్వేష్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని