అనిశ్చితిలో యువత భవిత

భాజపా విద్యా వ్యతిరేక విధానాలవల్ల దేశంలోని యువత మొత్తం నిరాశలో కూరుకుపోయిందని, వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Published : 11 Jul 2024 04:47 IST

భాజపా విద్యా వ్యతిరేక విధానాలే కారణం: రాహుల్‌ 

దిల్లీ: భాజపా విద్యా వ్యతిరేక విధానాలవల్ల దేశంలోని యువత మొత్తం నిరాశలో కూరుకుపోయిందని, వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. నియామకాల్లో మందకొడి కారణంగా ఐఐటీల్లోని ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ల వేతనాల్లో తగ్గుదల నమోదైందని వచ్చిన వార్తలపై బుధవారం ఆయన వాట్సప్‌ ఛానల్‌లో స్పందించారు. ‘ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన కారణంగా దేశంలోని ప్రతిష్ఠాత్మక వర్సిటీల్లోని విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నియామకాల్లో కోత పడుతోంది. వార్షిక వేతన ప్యాకేజీలు తగ్గుతున్నాయి. నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరింది. 2022లో 19శాతం విద్యార్థులకు ప్లేస్‌మెంట్లు దక్కలేదు. ఈ ఏడాది ఆ సంఖ్య రెట్టింపై 38శాతం మంది ఉద్యోగాలను పొందలేదు. దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన వాటి సంగతేంటి..’ అని రాహుల్‌ ప్రశ్నించారు. వృత్తి విద్యా కోర్సుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నారని, అధిక వడ్డీలకు విద్యా రుణాలను తీసుకుంటున్నారని, చివరకు ఉద్యోగాలు రాకపోవడంతో వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని వ్యాఖ్యానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని