అధ్వానస్థితిలో హాస్టళ్లు

కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లు అధ్వానస్థితిలో మగ్గుతున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

Published : 11 Jul 2024 04:46 IST

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లు అధ్వానస్థితిలో మగ్గుతున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ‘ఎక్స్‌’ వేదికగా ఆయన బుధవారం పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలన్నారు. మొత్తానికి కాంగ్రెసోళ్లు వచ్చారు. పెద్ద మార్పే తెచ్చారు. ఆనాటి కాంగ్రెస్‌ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి పురుగుల అన్నం, నీళ్ల చారు ఉండేది. ఈనాటి కాంగ్రెస్‌ పాలనలోనూ ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన పరిస్థితి నెలకొంది. మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతమైన ఘటన మరువకముందే.. నిన్న కోమటిపల్లి హాస్టల్లో.. ఉప్మాలో బల్లి పడి 20 మంది విద్యార్థులకు వాంతులైన ఘటన ఎదురైంది. ఇప్పుడు సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ హాస్టల్‌లో ఏకంగా చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. ఇకనైనా కాంగ్రెస్‌ సర్కారు కళ్లు తెరవాలి. లేకపోతే భావిభారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదం’’ అని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని