ప్రజలపై వేల కోట్ల భారం వేశారు: లంకా దినకర్‌

వైకాపా హయాంలో విద్యుత్తు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పొరుగు రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్తు కొనుగోలు చేశారని భాజపా నేత లంకా దినకర్‌ విమర్శించారు.

Published : 11 Jul 2024 04:36 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా హయాంలో విద్యుత్తు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పొరుగు రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్తు కొనుగోలు చేశారని భాజపా నేత లంకా దినకర్‌ విమర్శించారు. ఫలితంగా మాజీ సీఎం జగన్‌.. ప్రజలపై మోయలేని భారాన్ని వేశారని ధ్వజమెత్తారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో లంకా దినకర్‌ బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘విద్యుత్తు శాఖ నిర్వహణ లోపాల కారణంగా జగన్‌ సర్కారు ఐదేళ్లలో సుమారు రూ.32 వేల కోట్ల అదనపు భారాన్ని ప్రజల నెత్తినవేసింది’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని